పీఎస్ఎల్వీ -సి50 ప్రయోగం సక్సెస్

పీఎస్ఎల్వీ -సి50 ప్రయోగం సక్సెస్శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సిరీస్ లో 50వ రాకెట్ ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ -సి50 రాకెట్ ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఈ వాహక నౌక ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థ సీఎంఎస్-01 ను అంతరిక్షంలోకి పంపించింది. ఇది సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ- బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించిన ఉపగ్రహం. 44.4 మీ. ఎత్తు , 2.8 మీటర్ల వ్యాసం వున్న ఈ రాకెట్ 320 టన్నుల బరువు కలిగి వుంది. ఈ వాహక నౌక నాలుగు దశల్లో అంతరిక్షంలోకి చేరుకుంది. అదేవిధంగా భూ బదిలీ కక్ష్యలోకి 1,425 కిలోలు, సూర్యానువర్తన కక్ష్యలోకి 1750 కిలోల బరువును మోసుకెళ్లగలుగుతుంది. దీని పరిమితి భారత్ తో పాటు, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ లకు విస్తరిస్తుంది. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యునికేషన్ ఉపగ్రహం. ఈ రాకెట్ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా, 20.11 నిమిషాల్లో కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఏర్పాటు చేశారు. 1.410 కిలోల బరువు కలిగిన 42వ దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01ను ఈ రాకెట్ జియో స్టేషనరీ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్లోకి చేరవేయనుంది. 2011 లో ప్రయోగించిన జీశాట్-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దాని స్థానంలో జీశాట్-12 ఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది.