ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. దేవ్ జీ, రాజిరెడ్డి సరెండర్

ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. దేవ్ జీ, రాజిరెడ్డి సరెండర్

-లొంగిపోయిన మరో 16 మంది మావోలు
-రెండ్రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం

ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. దేవ్ జీ, రాజిరెడ్డి సరెండర్వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: భారత్ లో నక్సలిజం లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుంటోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, కీలక నేతలు, దశాబ్దాల పాటు పార్టీని నడిపించిన కీలక కమాండర్లు వరుసగా లొంగిపోతుండటం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIBముందు లొంగిపోయినట్లు సమాచారం. మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయినట్లు సమాచారం.. తెలంగాణ ఇంటలిజెన్స్ విభాగం గత కొద్ది కాలంగా వీరితో చర్చలు జరుపుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీల గురించి అవగాహన కల్పించినట్లు సమాచారం. ఇక 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

కేంద్రం విధించిన గడువు దగ్గరపడుతుండటంతో మిగిలిన మావోయిస్టు శ్రేణులపై ఒత్తిడి పెరుగుతోంది. హింసను, సానుకూలంగా చర్చలకు రావాలని లేదా లొంగిపోవాలని ప్రభుత్వం ఇస్తున్న పిలుపునకు ఈ తాజా సరెండర్లు ఒక పెద్ద ముందడుగు అవుతున్నాయి. దేవ్ జీ, రాజిరెడ్డి వంటి అగ్రనేతలు బయటకు రావడం అంటే మావోయిస్టు పార్టీకి వెన్నెముక విరిగినట్లే. అగ్రనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో కేడర్ లో నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింది.మరికొన్ని రోజుల్లో దశాబ్దాల సుదీర్ఘ సాయుధ పోరాటానికి అధికారికంగా ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు.