ఉదయమే క్షేమసమాచారం..అంతలోనే ప్రమాదం

ఉదయమే క్షేమసమాచారం..అంతలోనే ప్రమాదంచిత్తూరు జిల్లా : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఉండటంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో బిపిన్ రావత్ తో పాటు 13 మంది మరణించారు. మృతుల్లో చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన సాయితేజ ఉన్నారు.

ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2013 లో రక్షణ శాఖలో చేరిన సాయితేజ ప్రస్తుతం లాన్స్ నాయక్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

గత కొంతకాలంగా సీడీఎస్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. నేడు ఉదయమే భార్యతో ఫోన్లో సాయితేజ మాట్లాడి క్షేమసమాచారం అందించినట్లు మృతుని చిన్నాన్న తెలిపారు. గత వినాయక చవితికి స్వగ్రామం ఎగుర రేగడకు సాయితేజ చివరిసారిగా వచ్చి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.