ఘనంగా కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి వివాహ వేడుక

ఘనంగా జరిగిన ప్రముఖ నటులు, మనం సైతం వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి వివాహ వేడుకఘనంగా కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి వివాహ వేడుకహైదరాబాద్ : ప్రముఖ నటులు, ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.

ఎమ్మెల్సీలు ప్రకాష్ గౌడ్, రామచంద్రరావు, కర్నె ప్రభాకర్, మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, నటులు నరేష్, బ్రహ్మాజీ, శివాజీ, కృష్ణుడు, సాయి కుమార్, గీత రచయిత చంద్రబోస్, సుచిత్ర దంపతులు, దర్శకుడు దశరథ్, వీఎన్ ఆదిత్య, సముద్ర, చంద్ర మహేష్ తదితరులు హాజరయ్యారు. వధూవరులు సత్య శ్రీకృతి , ఈశ్వర్ లను ఆశీర్వదించారు.