రెండు నియోజకవర్గాలపై సీతక్క ఫోకస్ 

రెండు నియోజకవర్గాలపై సీతక్క ఫోకస్

రెండు నియోజకవర్గాలపై సీతక్క ఫోకస్ వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ములుగు ఎమ్మెల్యే సీతక్క పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. జనంలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీల కతీతంగా ఆమెకు అభిమానులున్నారు. కోవిడ్ సమయంలో ఆమె పనితీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమైనట్లు టాక్. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు లు సీతక్కను పిలిచి మరీ అభినందించినట్లు వార్తలొచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతీ చోటా బీఆర్ఎస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది కానీ, ములుగులో మాత్రం ఆ పరిస్థితి లేదు. దానికి కారణం సీతక్కనే అని చెప్పాలి. సీతక్కను చూసి జనమంతా కాంగ్రెస్ కే జై కొడుతున్నారట. సీతక్క ఏ పార్టీలో ఉన్నా ఆమెకే ఓటేస్తామని చెబుతున్నారట. అంతేకాదు ఇటీవల జరిగిన సర్వేల్లోనూ సీతక్కకు మంచి మార్కులు పడ్డాయని టాక్. ఇవన్నీ గమనించిన సీతక్క మరో ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

*కొడుకును రంగంలోకి దింపనున్న సీతక్క !
ములుగులో ఎలాగూ రాజకీయం తనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ తన కుమారుడిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్నది సీతక్క ఆలోచిస్తున్నట్లు టాక్. రాజకీయం అంతా తాను చూసుకుంటానని కుమారుడితో చెప్పినట్లు సమాచారం. దానికి సీతక్క కుమారుడు కూడా సిద్ధంగా ఉన్నారని టాక్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

*రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడంట !
రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ములుగులో తన కుమారుడిని పోటీ చేయించి, తాను వేరే నియోజకవర్గానికి వెళ్తానని సీతక్క ప్రతిపాదించినట్లు టాక్. దీనిపై రేవంత్ రెడ్డి కూడా విశ్లేషణ జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ లెక్కలు వేసుకుని సీతక్క అభిప్రాయంతో రేవంత్ రెడ్డి కూడా ఏకీభవించినట్లు సమాచారం.రెండు నియోజకవర్గాలపై సీతక్క ఫోకస్ *భద్రాచలం పై సీతక్క ప్రత్యేక దృష్టి !
ములుగు కాకుండా భద్రాచలం నియోజకవర్గంపై సీతక్క ప్రత్యేక దృష్టి సారించినట్లు టాక్. భద్రాచాలంలోనూ ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తన విజయం ఖాయమని ఆమె భావిస్తున్నారట. అందుకే భద్రాచలంపై సీతక్క ఫోకస్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.

*ఒకే దెబ్బకు రెండు సీట్లలో గెలుపు హస్తానిదే!
సీతక్కకు జనంలో ఉన్న అభిప్రాయం ప్రకారం చూస్తే అటు ములుగు, ఇటు భద్రాచలంలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. కాబట్టి ములుగులో సీతక్క కుమారుడిని నిలబెట్టి, ఆమె భద్రాచలంలో పోటీ చేస్తే కాంగ్రెస్ కు రెండు సీట్లు ఈజీగా వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ శ్రేణులు బల్లగుద్ది చెబుతున్నారు. విశ్లేషకులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సీతక్క నిజంగానే ములుగును వదిలి భద్రాచలం వెళ్తారా, ములుగులో తన కుమారుడిని నిలబెడతారా అన్నది కాలమే తేల్చాలి.