మళ్లీ యాక్టివ్ గా మారిన మండవ ! 

మళ్లీ యాక్టివ్ గా మారిన మండవ !

మళ్లీ యాక్టివ్ గా మారిన మండవ ! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగిన నేతల్లో మండవ వెంకటేశ్వరరావు ఒకరు. మంత్రిగానూ పనిచేసిన ఆయనకు నిజామాబాద్ రాజకీయాలపై మంచి పట్టుంది. అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలున్నాయి. ఇతర నాయకుల్లాగా ఆయన పరుషమైన పదజాలం వాడరు. సబ్జెక్ట్ వరకే మాట్లాడతారు. అందుకే ఆయనపై ఇతర పార్టీల నాయకులకు మంచి అభిప్రాయం ఉంది. మండవపై విమర్శలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఆయన మద్దతు కోరారంటే మండవ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మండవ వెంకటేశ్వరరావు కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ఆమధ్య బీఆర్ఎస్ లో కనిపించినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అసలు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారో లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఎన్నికల ముంగిట నిజామాబాద్ పాలిటిక్స్ లో మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ పలు పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం ఉంది. కాంగ్రెస్, బీజేపీలు మండవకు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు టాక్. అయితే ఆయన మాత్రం తన అభిప్రాయాన్ని బయటకు చెప్పకుండా దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.మళ్లీ యాక్టివ్ గా మారిన మండవ ! నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో బాజిరెడ్డిని కాదని మండవకు టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో మండవ వెంకటేశ్వర రావు వేరే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ఇతర పార్టీల్లోకి వెళ్లి అక్కడ్నుంచి బీఫాం తీసుకుని పోటీచేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం ద్రుష్ట్యా ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఈజీగా వస్తుందన్న అంచనాలున్నాయి. అటు బీజేపీలోనూ ఆయనకు కిషన్ రెడ్డి లాంటి అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. కాబట్టి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలో ఏ పార్టీ అయినా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

మండవ వెంకటేశ్వర రావు చూపు ఇతర పార్టీల వైపు ఉందన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్దలు ఆయనను బుజ్జగిస్తున్నారని టాక్. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని హామీ ఇస్తున్నారట. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మండవ బీఆర్ఎస్ లో ఉండే అవకాశాలు లేవనే తెలుస్తోంది. ఆయన ఇతర పార్టీల్లోకి జంప్ కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి మండల మదిలో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజంగానే ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటారా? లేదా ఇతర పార్టీల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.