ఆగస్టులో ఇంటర్ పాఠాలు

హైదరాబాద్: కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా పాఠాలు బోధించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తు న్నది. ఆగస్టు నుంచి బోధన ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేపట్టింది ది. అయితే, సిలబస్ కోతలు విధించేందుకు బోర్డు సిద్ధంగా లేదు. ఆగస్టులో ఇంటర్ పాఠాలుజేఈఈ, నీట్ ఎంసెట్ తో పాటు ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలన్నీ సిలబస్ ఉన్నందున కొత్త సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు. ఆగస్టు రెండు లేదా మూడో వారం నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించే అవకాశాలను పరి శీలిస్తున్నామన్నారు. యూట్యూబ్, టీశాట్, యాదగిరి, మనటీవీ ఇతర చానళ్ల ద్వారా బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. డిజిటల్ పాఠాలు బోధించే విధానంపై రెగ్యులర్ కాంట్రాక్టు లెక్చరర్లందరికీ శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు ఈ శిక్షణ కొనసాగనున్నది. ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు కూడా డిజిటల్ బోధనపై శిక్షణ ఇవ్వాలని బోర్డు అధికారులు కాలేజీల యాజమాన్యాలకు చెప్తు న్నారు. అటు.. ఆన్లైన్ పాఠాల నియంత్రణకు బోర్డు చర్యలు తీసుకుంటున్నదిత్వరలోనే కాలేజీలకు నోటీసులు ఇవ్వనుంది.