ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

మహబూబాబాద్ జిల్లా: అసలే ఓవర్ లోడు. ఆపై అతివేగం.. వెరసి ఓ నలుగురి ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇది డ్రైవర్ నిర్లక్ష్యమనాలో.. లారీ యజమాని కక్కుర్తి అనాలో తెలియని పరిస్థితి. కట్టెల లోడుతో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో నలుగురు మృతిచెందారు,7 గురికి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీటాయపాలెంలో కట్టెల లోడుతో వెళుతున్న ఓ లారీ అర్థరాత్రి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతిఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చనిపోయిన వారిని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి ఓవర్ లోడుతో పాటు అతివేగం కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.