ఉమ్మడి వరంగల్ లో కరోనా విలయతాండవం

వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. బుధవారం ఒక్కరోజే ఉమ్మడివరంగల్ జిల్లా వ్యాప్తంగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 44,ములుగు జిల్లాలో 04, మహబూబాబాద్ జిల్లాలో 05,జనగామ జిల్లాలో 08, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.