జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదుజగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈ నెల 25న షార్జా నుంచి జిల్లాలోని మెట్ పల్లికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ ఐనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంటనే హైదరాబాద్ టిమ్స్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే తను ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈనెల 25న ఆ వ్యక్తి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో శాంపిల్స్ ఇచ్చాడు. జీనోమ్ సీక్వెన్స్ కు శాంపిల్స్ పంపించగా, అది ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్దారణ అయ్యింది. మెట్ పల్లికి వచ్చిన తర్వాత అతను గత మూడు రోజులు నుంచి పలు ప్రాంతాల్లో తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.