శివనామస్మరణతో మార్మోగిన ప్రముఖ శైవక్షేత్రాలు

శివనామస్మరణతో మార్మోగిన ప్రముఖ శైవక్షేత్రాలు

వరంగల్ టైమ్స్, హన్మకొండ జిల్లా : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామున నుంచే రుద్రుడి దర్శనం కోసం భక్తజనం భారీగా తరలివచ్చారు. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. హన్మకొండలోని వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్టలోని శ్రీ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయం, ములుగుజిల్లా రామప్పలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసిహ ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కొడవటూరులోని సిద్దేశ్వర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు చేరుకొని శివునికి జలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

శివనామస్మరణతో మార్మోగిన ప్రముఖ శైవక్షేత్రాలు