రుద్రేశ్వరాలయంలో కల్యాణం కమనీయం

రుద్రేశ్వరాలయంలో కల్యాణం కమనీయంరుద్రేశ్వరాలయంలో కల్యాణం కమనీయం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: చారిత్రాత్మకమైన రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆదివారం ఉదయం 3:30 గంటలకు సుప్రభాత సేవ మంగళ వాయిద్య సేవ నిర్వర్తించారు. ఉత్తిష్ఠ గణపతి ఆరాధన రుద్రేశ్వరునికి పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించారు. ఉదయం 5 గంటల నుండి సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10 గంటల వరకు నిర్వర్తించారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ఉత్తరాషాడ నక్షత్రం సుముహూర్త సమయంలో రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం మహాగణపతి ఆరాధనతో ప్రారంభమైనది. స్వస్తి పుణ్యాహవాచనం పంచగవ్య పూజ పంచాన్నిక దీక్షను అనుసరించి అంకురారోపణ నందీశ్వర బృంగేశ్వర పూజ నిర్వర్తించి రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామివార్లను కళ్యాణ వేదికపై ప్రతిష్టించిన సందర్భంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు ముత్యాల తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. యజ్ఞోపవీత దారణ భాషిగా ధారణ జిలకర్ర బెల్లం పాదపూజ మహా సంకల్ప మంత్ర పఠనముతో సుముహూర్త సమయమున మంగళ గౌరీ పూజ మాంగల్య ధారణ అక్షతారోహణ పుష్పార్చన నిర్వర్తించారు. ఈ కళ్యాణానికి ఉభయ దాతలుగా వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు, మాడిశెట్టి సాంబయ్య దంపతులు వరుడు తరపున వెంకటేశ్వరరావు, వధువు పక్షాన మాడిశెట్టి సాంబయ్య దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ వ్రతం నిర్వర్తించడం జరిగింది.

రుద్రేశ్వరాలయంలో కల్యాణం కమనీయంలింగోద్భావ సమయమున మహాన్యాస పూర్వక 111రుద్రములతో నమక చమకాదులతో 101 లీటర్ల ఆవుపాలతో 51 లీటర్ల ఆవు పెరుగుతో పుట్ట తేనెతో నెయ్యి చక్కెరతో పండ్ల రసములతో 12 మంది వేద పండితుల ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నిర్వర్తించడం జరిగినది. ఆదివారం ఉదయం రుద్రేశ్వర స్వామి రుద్రాభిషేకంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నీలిమ దంపతులు,విష్ణువర్ధన్ రెడ్డి సతీమణి గోదాదేవి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి,ప్రముఖ బిల్డర్ సీతారామరెడ్డి,వేముల సత్యమూర్తి,రామ్ రెడ్డి, ఏసీపీ నరసింహారావు,సీఐ మచ్చ శివకుమార్, ఉత్సవ అధికారి రాముల సునీత, జిల్లా న్యాయమూర్తులు,వాగ్దేవి కళాశాల చైర్మన్ చందుపట్ల దేవేందర్ రెడ్డి ,హైకోర్టు జస్టిస్ సాంబశివ నాయుడు, వరంగల్ ఎంపీ కడియం కావ్య సిటీ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, శాసనమండలి ప్రత్యక్ష నాయకుడు సిరికొండ మధుసూదనా చారి, బిజెపి హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సతీమణి రేవతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మండువ శేషగిరిరావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి బంధువులు స్థానిక కార్పొరేటర్ తోటా వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, ప్రముఖ సినీ గేయ రచయిత వరంగల్ వాసి కాసర్ల శ్యామ్.తదితరులు పాల్గొని స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వర్తించారు. 5000 మంది భక్తులు స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. ఉదయం నుండే దేవాలయానికి లక్షలాదిమంది క్యూలైన్లో రుద్ర నామస్మరణ చేస్తూ లక్షలాదిమంది స్వామివారిని దర్శించుకున్నారు.

రుద్రేశ్వరాలయంలో కల్యాణం కమనీయంఅన్ని పండుగలు పగటిపూట జరుపుకోవడం మన సాంప్రదాయం అయితే రాత్రిపర్వంగా పేరు గాంచినదే మహాశివరాత్రి అంతర్ముఖమైన ధ్యాన స్థితిలో బయట ప్రపంచాన్ని మరచి శివైక్యం చెందే జాగ్రత్త చైతన్య ప్రయాణమే రాత్రి అలసిన జీవితం రాత్రిపూట సేన తీరుతుంది జ్ఞాన ధ్యాన చైతన్యం కూడా రాత్రిలోనే సాధ్యపడుతుంది. రాత్రి సాధన జరపవలసిన ప్రధానమైన ఈ పండుగ శివ-రాత్రి శివుడి రాత్రిగా పేరుగాంచింది శివనామ స్మరణ బిల్వ దళార్చన అభిషేకం జాగరణ శివరాత్రి రోజు మనం సమర్పించుకోగల నీరాజనాలు దిగస్వరూపుడైన బోలా శంకరుడు ఫలం పత్రం పుష్పం తోయం ఏది భక్తితో సమర్పించిన స్వీకరిస్తాడు దీవిస్తాడు. పత్రాలు నీరే ఆయనకు ప్రియం భక్తి నిండిన హృదయం ఉంటే చాలు పరమేశ్వరుడి హృదయంలో చోటు దక్కినట్టే. పరమశివుడు అంతులేని ఆకాశ రూప నిరాకార సాకార సర్వాకార ఓంకార స్వరూపం ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చొని ఉన్నప్పుడు వారిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది. దీనిపై బ్రహ్మ విష్ణువులు సంభాషణ నుంచి చర్చకు దిగారు. అంతలో శివుడు వారికి పరతత్వం అర్థం అవ్వాలని అంతర్దనుడై అనంత లింగాకారుడిగా ఆవిర్భవించాడు. సృష్టితత్వం పరమశివుడి పరతత్వమేనని గ్రహించిన గొప్ప సమయమే లింగోద్భవ కాలం ఆరోజే మహాశివరాత్రి మహా పుణ్య కాలమిది. అడిగిన వరాలు ఇచ్చే బోలా శంకరుడు క్షీరసాగర మదనంలో వచ్చిన గళారాన్ని మింగి లోకానికి అమృతాన్ని పంచి నీలకంఠుడు అయ్యాడు.రుద్రేశ్వరాలయంలో కల్యాణం కమనీయంశివ కళ్యాణం లో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారపల్లి మహేశ్వర శర్మ శివతత్వంపై ఉద్బోధించాడు. ఆలయ కార్యనిర్వాహన అధికారి డి అనిల్ కుమార్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ వైదిక పండితులు వైదిక కార్యక్రమాలను నిర్వర్తించారు. రుద్రేశ్వర సేవా సమితి సభ్యులు చొల్లేటి కృష్ణమాచారి గండ్రాతి రాజు,కట్ల రాజు,సురేష్ కుమార్,శివలింగా చారి. నవీన్ కుమార్ చారి విశేషమైన సేవలో భక్తులకు అందించారు . ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భక్తులకు మంచినీరు అందించారు. సుధీర్ రావు, తాడూరి రేణుకా బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శనలు బోడిగ లక్ష్మీనారాయణచే శివపార్వతుల కళ్యాణ హరికథా కాలక్షేపం నిర్వర్తించడం జరిగింది.జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.శివుడికి రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి పర్వదినం ఆదివారం రావడంతో పాటు తెల్లారి సోమవారం కావడంతో భక్తుల రద్దీతో తెల్లవారుజాము వరకు ఆలయ పరిసర ప్రాంతాల్లొ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.