ఇంటర్ బోర్డును ముట్టడించిన టీజేఎస్ఎఫ్ నాయకులు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: శనివారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు. అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు మద్దతు ఇస్తోందని, అక్కడ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.














