అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యవరంగల్ టైమ్స్, సంగారెడ్డి జిల్లా: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరాతండాకు చెందిన రైతు జాదవ్ సురేష్ నాయక్ (53) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి అవసరాల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేశారు. దీంతో అప్పుల బాధలు పెరిగి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు సురేష్ నాయక్. ఇంకా చేసేదేమీ లేక ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాసవిడిచాడు.