బస్సు నదిలో పడి 18 మంది మృతి

బస్సు నదిలో పడి 18 మంది మృతి

బస్సు నదిలో పడి 18 మంది మృతి
వరంగల్ టైమ్స్, నేపాల్: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్‌ జిల్లాలో ఓ బస్సు ఖాట్మాండ్ కు వెళ్తుండగా అదుపుతప్పి నదిలో పడింది. దీంతో 18 మంది మృతి చెందారు. అలాగే 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. నది ప్రవాహం బలంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నాని స్థానిక పోలీస్ యంత్రాంగం తెలిపింది. ఈఘటనతో ధాండింగ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.