మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు

మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు

-వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్లాటినం జూబ్లీ
-70 ఏళ్ల వేడుకలో పాల్గొననున్న పూర్వ విద్యార్థులు
-ముందస్తుగా రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం
—అధ్యక్షులు ఇ.వి. శ్రీనివాస్

మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలువరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : మార్చి 29 ఆదివారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఇ.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడుతున్న 70 ఏళ్ల పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి పూర్వ విద్యార్థి తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. కళాశాలలో చదివిన రోజుల మధురస్మృతులను స్మరించుకునే ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.మార్చి 29న జరిగే వేడుకల్లో పాల్గొనాలనుకున్న పూర్వ విద్యార్థులు వెంటనే క్రింది బ్యాంకు ఖాతాలో రూ.1,000/- (వెయ్యి రూపాయలు) నమోదు రుసుము జమ చేసి తమ పూర్తి వివరాలను తెలియజేయాలని కోరారు.

బ్యాంకు వివరాలు:
ఖాతా నెంబర్: 62052476227
ఖాతా పేరు: పూర్వ విద్యార్థుల సంఘం, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్
బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శాఖ: ఎంజీఎం వరంగల్

ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం రూ.10,000/- విరాళం అందించిన 1965 బ్యాచ్ పూర్వ విద్యార్థి ఎం. మల్లారెడ్డిని సమావేశంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం పెద్దలు టి ఎన్ స్వామి , ప్రకాష్ , ఉదయభాస్కర్, శ్రీనివాసులు , ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్‌తో పాటు సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్ రావు, శ్యామ్, ఉమేందర్, వసంత్ కుమార్ , శశి, కుమార్, ఉషా కిరణ్, కార్తీక్, కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.