శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ
వరంగల్ టైమ్స్, శ్రీశైలం: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను అధికారులు నిలుపివేసారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనాల క్యూలైన్ల ద్వారా భారీగా స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. ఆన్‌లైన్ లో విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి కల్పిస్తున్నారు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది.














