శబరిమల వివాదంలో కీలక మలుపు!

శబరిమల వివాదంలో కీలక మలుపు!

వరంగల్ టైమ్స్,శబరిమల : కేరళలో వెలసిన శబరిమల ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ, 10-50 ఏళ్ల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(TDB) నిర్ణయించింది. ఆచారాల పరిరక్షణే తమ ప్రాధాన్యతని బోర్డు స్పష్టం చేసింది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో జరగనున్న సమీక్ష పిటిషన్ల విచారణలో ట్రావెన్ కోర్ బోర్డు తన అఫిడవిట్ను సమర్పించనుంది. గతంలో ప్రవేశానికి అనుకూలంగా ఉన్న బోర్డు ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం.