రాష్ట్రాన్ని మళ్లీ వణికిస్తున్న చలి తీవ్రత

రాష్ట్రాన్ని మళ్లీ వణికిస్తున్న చలి తీవ్రతహైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. తూర్పు, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో చలి మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున నుంచే పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తెల్లారినప్పటికీ హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు.

భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా ప్రయాణాలకు ఆటంకం కలుగుతున్నది. చలితీవ్రత పెరిగిపోవడంతో సంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్పంగా రాత్రి ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర పేర్కొంది.