బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..!!

బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..!!

వరంగల్ టైమ్స్,హెల్త్ డెస్క్ : నేటికాలంలో చాలామంది ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఎందుకంటే మారిన జీవనశైలి వల్ల ఎన్నో వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. ముఖ్యంగా షుగర్, బీపీ ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఇక ప్రతీరోజూ ఉదయం టీ తాగకుండా ఉండలేరు. అందులో చక్కెరను ఎక్కువగా కలుపుకుని తాగేవాళ్లూ చాలానే ఉంటారు. అయితే చక్కెరకు బదులుగా బెల్లం కూడా ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం శరీర జీర్ణశక్తి పెంచడం నుంచి శరీరంలోని రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో బెల్లం పాత్ర గొప్పది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది.

బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..!!

*చర్మ సంరక్షణలో బెల్లం*
చర్మంపై ఎలాంటి అలర్జీని లేదా శరీరం లోపలి భాగంలో శ్వాస సమస్య, ఆస్తమాను నివారిస్తుంది. కానీ చాలా మందికి బెల్లం చర్మానికి ఉపయోగపడే గుణాల గురించి తెలియదు.

*చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం*
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. బెల్లంలో జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌తో పోరాడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే సెల్ డ్యామేజ్ ప్రక్రియను నివారిస్తుంది.

*శరీరం రోగనిరోధక వ్యవస్థ*
బెల్లం మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఇది ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎలాంటి చర్మ వ్యాధులకైనా బెల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంతర్గతంగా, చర్మంపై మొటిమలకు బెల్లం ఒక రకమైన ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మీ ఆహారంలో చక్కెరను తొలగించి, బెల్లం చేర్చండి.

*చర్మ ఆరోగ్యానికి బెల్లం ఎలా ఉపయోగించాలి?*
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతీరోజూ భోజనం తర్వాత బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. దీని వల్ల మన చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చర్మంపై ముడతలు, గీతలు లేదా వయస్సుపైబడినట్లు వచ్చే మచ్చలు తొలగిపోతాయి.

-రెండు టీస్పూన్ల తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల బెల్లం చూర్ణం కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. ఆ తర్వాత మీ చర్మాన్ని చల్లటి నీటితో కడిగేస్తే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

-ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిని తీసుకుని దానికి సమాన మోతాదులో టొమాటో రసం, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, కొద్దిగా పసుపు వేసి కలపాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది మీ ముఖం మీద మొటిమల మచ్చలను తొలగించి మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

*మొటిమలు విపరీతంగా ఉంటే…?*
మీకు మొటిమలు ఎక్కువగా ఉంటే, వీలైనంత ఎక్కువ బెల్లం పొడి, నిమ్మరసం, నీరు కలిపి పేస్ట్ చేయండి. దీన్ని ప్రతీరోజూ మీ చర్మంపై అప్లై చేయండి. క్రమంగా మీరు చర్మంలో మార్పులను చూస్తారు.

*స్వచ్ఛమైన బెల్లం ఎలా దొరుకుతుంది?*
స్వచ్ఛమైన బెల్లం సాధారణంగా చాలా ముదురు గోధుమ రంగులో గట్టిగా ఉంటుంది. అలాగే బెల్లం తిన్నప్పుడు చేదుగానీ, ఉప్పుగానీ ఉండకూడదు.