చలికాలంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టండిలా..!!

చలికాలంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టండిలా..!!

వరంగల్ టైమ్స్,హెల్త్ డెస్క్ : చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్య ఎదురవుతుంది. అది విపరీతంగా పెరిగితే చాలా కష్టంగా మారుతుంది. అధిక చుండ్రు కారణంగా మీ జుట్టు బలహీనంగా మారుతుంది. కొన్నిసార్లు చుండ్రు మీ బట్టలపై పడి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులు ధరిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీన్ని వదిలించుకోవడానికి హోం టిప్స్ చూద్దాం.

చలికాలంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టండిలా..!!

*పెరుగు*
పెరుగు మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది. అలాగే జుట్టును స్ట్రాంగ్ గా, సిల్కీగా మార్చుతుంది. చుండ్రు పోవాలంటే అందులో బేకింగ్ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేయాలి. చేతులతో తలపై మసాజ్ చేయండి.

*తులసి నీరు*
చుండ్రు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని వేప, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. దీని తర్వాత ఈ నీటితో మీ వెంట్రుకలను కడగాలి. ఇలా కొద్దిరోజుల పాటు చేసినట్లయితే చుండ్రు సమస్య తగ్గుతుంది.

*టీ ట్రీ ఆయిల్*
చుండ్రు సమస్య ఉన్నప్పుడు టీ-ట్రీ ఆయిల్ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రు సమస్యను దూరం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని షాంపూలో మిక్స్ చేసి తల స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

*కొబ్బరి నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేయాలి*
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకోవాలి. ఆపైన తేలికపాటిగా తలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.