రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు  

రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు  గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.