శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు రద్దు 

శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు రద్దు

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుపతిలో ఈ నెల 10 నుంచి 12 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 65,577 మంది భక్తులు దర్శించుకోగా 29,165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు రద్దు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు. పైగా తిరుపతిలోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.