శ్రీవారీ హుండీ ఆదాయం రూ. 2.45 కోట్లు

శ్రీవారీ హుండీ ఆదాయం రూ. 2.45 కోట్లుతిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.45 కోట్లు హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 14,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు.

జనవరి 1న 36,560 మంది భక్తులు, జనవరి 2న 38,894 మంది భక్తులు, జనవరి 3న 31,776 మంది, జనవరి 4న 31, 523 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇక కరోనా ఉధృతి కారణంగా భక్తుల రాత తగ్గుముఖం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.