కవితను కలిసిన ఏపీ బీఆర్ఎస్ నేతలు

కవితను కలిసిన ఏపీ బీఆర్ఎస్ నేతలు

కవితను కలిసిన ఏపీ బీఆర్ఎస్ నేతలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తోట చంద్ర శేఖర్, రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు, పార్థసారథిలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. కవితను కలిసిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర నేతలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్సీ కవితతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా, చేయాల్సిన కార్యచరణ వంటి అంశాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం.