కక్షపూరిత రాజకీయాలకు C/O కాంగ్రెస్: దాస్యం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఆ హామీల అమలు మరిచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీఆర్ఎస్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే , హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ,ఈ రెండున్నర సంవత్సరాల కాలం టైం పాస్ చేసిందని ఆరోపించారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి, సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలసముద్రంలోని హనుమకొండా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అసమర్థత పాలనను ఎండగట్టారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడుతున్నామని, అదే పోరాటంతో ముందుకు వెళ్తామన్నారు. జనతా గ్యారేజ్ లాగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు పని చేస్తున్నాయిన్నారు.దేవాదుల ప్రాజెక్టును 90 శాతం బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది. మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేయలేకపోయిందని దాస్యం ఎద్దేవా చేశారు. హరీష్ రావు మొన్న దేవాదుల పరిశీలనకు వస్తే అధికారులు వారికి కనీసం ప్రోటోకాల్ ఇవ్వలేదని మండిపడ్డారు.రైతులకు కనీసం సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. ఆదివారం జరిగిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశములో పార్టీ కోసం 1000 కోట్లు వెచ్చిస్తా అని చెపుతున్నారు అది ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ము చేసేందుకు కాంగ్రెస్ అభివృద్ధి పనులకు వాడుకుందని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును 2027 డిసెంబర్ చివరికల్లా పూర్తి చేసి ప్రజలకు అందిస్తా అన్నారు… ఇదే ముఖ్యమంత్రి 2024 ఆగస్ట్ 21 న పూర్తి చేస్తామని, ఇదే కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ 2025 న పూర్తి చేస్తా అని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.ఒకే ప్రభుత్వం, మంత్రివర్గం ఇన్ని సార్లు మాటలు మార్చడం, ప్రజలను ఏమార్చడమేనని అన్నారు. సిగ్గు ఉందా రేవంత్ రెడ్డి,విహారాయత్రకు వచ్చినట్టు 50 నిమిషాలు పర్యటన చేసి వెళ్లిపోయావు, కనీసం ఒక్క పూట కూడా సమీక్ష చేయలేని మీరు వరంగల్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.దేవాదులకు హరీష్ రావు రాగానే ముఖ్యమంత్రి వచ్చి విహారాయత్రకు చేసి వెళ్లిపోయారని విమర్శించారు.కేవలం కేరళలో జరిగే ఎన్నికల ఫండ్ కోసం మాత్రమే దేవాదుల నిర్మాణంపై ఈ సమీక్షలు చేస్తున్నారు.
దేవాదుల మూడో ఫేజ్ నిర్మాణ వ్యయాన్ని 17000 కోట్ల అంచనా వేసి ఇప్పుడు 24,000 కోట్లకు ఎలా పెంచారు.పెంచిన 7 వేల కోట్లలో కాంట్రాక్టర్లను నుంచి కాంగ్రెస్ వేల కోట్లు దండుకోనుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనల్ని మోసం చేస్తోంది.కేసీఆర్, కేటీఆర్ దృష్టికి దేవాదుల అంశాన్ని తీసుకొని, దేవాదుల మోసంపై రానున్న రోజుల్లో రైతుల పక్షాన ఆందోళనలు చేయబోతున్నాము..ఇట్టి విషయాన్ని వరంగల్ ప్రజలు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను గాలికి వొదిలేయం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, గతంలో కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు, పడావు పడింది అన్నారు.. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ తన చిల్లర తనాన్ని చాటుకుంటున్నాడని అన్నారు.
మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు హరీష్ రావు వచ్చి 24 గంటలు కాకముందే రాష్ట్ర సీఎం ఆగమేఘాల మీద వచ్చి గాలిలో వచ్చి, గాలిలోనే వెళ్లిపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలకు, మంత్రుల మాటలకు, ఎమ్మెల్యేల మాటలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందుకు ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి పిండాలు పెట్టే కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు.దేవాదుల గురించి గొప్పగా చెప్పుకొనే శ్రీహరి, కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదన్నారు.
కేసీఆర్ రూ. 7 వేల కోట్లు కేటాయించి అసంపూర్తిగా ఉన్న దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2లను పూర్తి చేసి, ఫేజ్ 3 ప్రణాళికలు పనులు ప్రారంభించారు.రెండేళ్లు దాటినా దేవాదులలో తట్టెడు మట్టి తీయలేదని అన్నారు.దేవాదుల మోటార్లు ఆన్ చేయలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులు అని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు జానకి రాములు, చందర్, అఫ్జల్, మట్టపెల్లి రమేష్, పులి రజినీకాంత్, నార్లగిరి రమేష్, జనార్థన్ గౌడ్, దశరథం, రఘు, నయీమొద్దీన్, కోటిలింగం, వినోద్ కుమార్, రామ్మూర్తి, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.














