మరోసారి చర్చలకు ఆహ్వానం

మరోసారి చర్చలకు ఆహ్వానంఢిల్లీ : భారత్​ బంద్​ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత 12 రోజులుగా రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రైతు సంఘాలు భారత్​బంద్​కు పిలుపునిచ్చాయి. కాగా ఈ బంద్​ ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలో అమిత్​షా ఈ రోజు రాత్రి 7 గంటలకు రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఐదో విడత చర్చలలో రైతు సంఘాల నాయకులు చట్టాల్లో సవరణలకు ఒప్పుకోకపోవడంతో మరోసారి చర్చలకు ముందుకొస్తామని నరేంద్రసింగ్​ తోమర్​, పీయూష్​గోయల్​ చెప్పారు. రైతుల చర్చలను విరమింపజేయడమే లక్ష్యంగా ఈ నెల 9న మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు. అయితే అమిత్​షా చర్చలకు ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి రైతు సంఘాల నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.