పోరాడి ఓడిన టీమిండియా

పోరాడి ఓడిన టీమిండియా

సిడ్నీ: ఆసీస్​తో జరిగిన మూడో టీ20 మ్యాచ్​లో టీమిండియా జట్టు పోరాడి ఓటమిపాలైంది. ఆసీస్​ నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్​ చేరుకోలేకపోయింది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(85:61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రారంభంలో ఓపెనర్​ శిఖర్​ ధావన్​(28:21 బంతుల్లో3ఫోర్లు), చివరలో హార్ధిక్​ పాండ్య(20:13 బంతుల్లో1 ఫోర్​, 2 సిక్సర్లు) చేశారు. ఇతర బ్యాట్స్​మెన్స్​ సహకారం లేకపోవడంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. దీంతో ఆసీస్​ 12 పరుగులతో తేడాతో విజయాన్ని దక్కించుకుంది.