ఫేస్‌బుక్‌ ఎఫెక్ట్.. కానిస్టేబుల్‌ భార్య సూసైడ్

ఫేస్‌బుక్‌ ఎఫెక్ట్.. కానిస్టేబుల్‌ భార్య సూసైడ్

ఫేస్‌బుక్‌ ఎఫెక్ట్.. కానిస్టేబుల్‌ భార్య సూసైడ్వరంగల్ టైమ్స్, అనంతపురం జిల్లా : అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌ పోస్టులతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కానిస్టేబుల్‌ మోహనకృష్ణ భార్య ఫేస్‌బుక్‌లో ఇటీవల కొన్ని పోస్టులు చేశారు. ఆమె పోస్టుల కింద మరో కానిస్టేబుల్‌ గురుమోహన్‌రెడ్డి అసభ్య మెసేజ్‌లు పెట్టాడు. వీటిని మోహనకృష్ణ చూడడంతో దంపతుల మధ్య రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. గురుమోహన్‌రెడ్డిపై పీఎస్‌లో భార్యతో మోహనకృష్ణ ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనతో ఆమె ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.