పాంచజన్య పోలీ ప్రొడక్ట్స్ లో అగ్నిప్రమాదం 

పాంచజన్య పోలీ ప్రొడక్ట్స్ లో అగ్నిప్రమాదం

వరంగల్ టైమ్స్, విశాఖ : ఆటోనగర్ డి బ్లాక్ పాంచజన్య పోలీ ప్రొడక్ట్స్ కంపెనీ లో అగ్నిప్రమాదం సంభవించింది. థర్మోకాల్ షీట్స్ తయారి కంపెనీలో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో గాజువాక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో స్థానికులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించినప్పటికీ 50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. అయితే ఈ అగ్ని ప్రమాదం క్రోమియం వైర్ కట్ కావడం వలన జరిగినట్లు సమాచారం.