వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యకు అరుదైన గౌరవం
-ఎంపీ డా.కడియం కావ్యకు అంతర్జాతీయ పార్లమెంటరీ బాధ్యత
-ఇండియా–సౌదీ అరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా ఎంపికైన కడియం కావ్య
వరంగల్ టైమ్స్, హనుమకొండ: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యకి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఏర్పాటు చేసిన ఇండియా–సౌదీ అరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యని గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ (కాన్ఫరెన్స్ అండ్ ప్రోటోకాల్ బ్రాంచ్) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారతదేశం–సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఈ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, ఈ బాధ్యత తనకు అప్పగించినందుకు లోక్‌సభ స్పీకర్ కి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. భారత్–సౌదీ అరేబియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పార్లమెంటరీ స్థాయిలో తన వంతు కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. ఈ నామినేషన్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి గర్వకారణమని, అంతర్జాతీయ పార్లమెంటరీ వేదికపై తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకువస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.














