మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులువరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులను ప్రారంభిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. మార్చి 16 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పనిచేస్తాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్ 24 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.