వైభవంగా యాదగిరీశుడి తిరు కల్యాణం

వరంగల్ టైమ్స్, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 25, 2026 (బుధవారం) రాత్రి అత్యంత వైభవంగా తిరు కల్యాణ మహోత్సవం జరిగింది. ప్రధానాలయంలోని తూర్పు మాడవీధుల్లో సకల దేవతల సమక్షంలో, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ స్వామి-అమ్మవార్ల కల్యాణ తంతు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామి అమ్మవార్లకు సాంప్రదాయ పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి కొండా సురేఖతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అధికారులు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి కల్యాణ వేడుకను తిలకించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించి పుణీతులయ్యారు. ఇక మరుసటి రోజు గురువారం రథోత్సవం ఉంటుంది.














