గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయి
బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి: ఆర్థిక మంత్రి
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. ఈ పరిణామాలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందని చెప్పారు. ఇక ఇటీవల అమెరికా సుంకాల్లో మార్పుల ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుందని నిర్మలా సీతారమన్ పేర్కొన్నారు














