ముంబై: శివసేనలో చేరనున్నట్లు కొన్ని రోజుల నుంచి నటి ఊర్మిళ మంటోడ్కర్పై ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఊహాగానాలకు ఆమె తెరదించి మంగళవారం శివసేన పార్టీలోకి చేరారు. ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే సమక్షంలో బాంద్రాలోని సీఎం థాకరేకు చెందిన మాతోశ్రీ నివాసంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఊర్మిళ మంటోడ్కర్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కలహాల వల్లే తాను ఓడినట్లు ఆమె ఆరోపించారు. దీంతో కాంగ్రెస్కు గత సంవత్సరమే రాజీనామా చేశారు. గవర్నర్ కోటాలో ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.