జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలి

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలి

వరంగల్ అర్బన్: రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కోరారు. గ్రేటర్ వరంగల్ నగరంలో డివిజన్ల వారీగా వున్న ఓటర్ల జాబితాను తారుమారు చేస్తూ ఇతర డివిజన్ లలో నమోదు చేస్తున్నందున రాబోయే ఎన్నికల్లో ఓటింగు శాతం తగ్గిపోయి అభ్యర్థుల తలరాతలు మారే అవకాశం వుందని ఆమె అభిప్రాయపడ్డారు. గ్రేటర్ వరంగల్ నగరంలో డివిజన్ల వారీగా వున్న ఓటర్లను యధాతథంగా కొనసాగించుటకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ కొత్త ఓటర్లకు అవకాశం కల్పించి ఓటరు నమోదు శాతాన్ని పెంచాలని కోరుతూ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కట్ల శ్రీనివాస్ రావులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మెజిస్ట్రేట్ అండ్ రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందచేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్.సి సెల్ కన్వీనర్ బందెల రాజభద్రయ్య, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా.గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి , అశం కళ్యాణ్, సందుపట్ల ధన్ రాజ్, అంకేశ్వరపు సురేందర్, మల్లం కుమార్, భరద్వాజ్, వంశీకృష్ణ, రజనీకాంత్, దండ్రే రమేష్ పాల్గొన్నారు.