25 నుంచి పీజీ మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్

25 నుంచి పీజీ మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్వరంగల్ జిల్లా : పీజీ మెడికల్ కన్వీనర్ కోటీ సీట్ల భర్తీకి ఈ నెల 25 నుండి 27 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెల్పింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ శనివారం మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు అదే విధంగా నిమ్స్ మెడికల్ కాలేజీలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి 27 మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.