సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత

సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూతవరంగల్ టైమ్స్, ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69 సం.లు) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న బప్పి లహిరి ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఒంటినిండా బంగారంతో ప్రత్యేకంగా కనిపించే బప్పి లహిరి..1980, 1990వ దశకాల్లో తన డిస్కో మ్యూజిక్ తో భారతీయ సినీపరిశ్రమను ఒక ఊపుఊపేశారు. ఆయన సంగీత దశకాల్లో తన డిస్కో మ్యూజిక్ తో భారతీయ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేశారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్, షరాబీ వంటి పలు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.