కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఆలోచనలతో కాంగ్రెస్ దాష్టీకాలకు ఒడిగడతుంది.ఇందులో భాగంగానే అధికారం అండ చూసుకుని తప్పుడు కేసులు, అరెస్టులతో ప్రతిపక్షాలపై కక్షపూరిత చర్చలకు పాల్పడుతుంది. ఇక తాజాగా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నాడు తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్కరెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయనే కారణంతో అక్కడ నుంచి ఎర్రబెల్లిని నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా చైర్మన్ ను ఎణ్నుకున్నారు. తొర్రూరులోని తన కార్యాలయంలోకి వెళ్లనివ్వలేదన్నారు. 45 యేండ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.














