మీడియా అకాడమీ చైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడగింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్,ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU)జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపక్షం ఎడిటర్‌గా ఉన్న ఆయనను 2024లో మొదటిసారి నియమించగా, పనితీరుపై సంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఆయన మరో రెండేళ్ల పాటు అదే పదవిలో కొనసాగుతారు.గతంలో ఉన్న వేతనం, అలవెన్సులు, క్యాబినెట్ ర్యాంక్ హోదా కొనసాగుతాయి. ఈ పొడిగింపుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి.











