తొర్రూరులో గెలుపు దిశ మార్చిన ఎంపీ కడియం కావ్య
వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గారికి కృతజ్ఞతల వెల్లువ
వరంగల్ టైమ్స్, వరంగల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య వేసిన ఒక్క ఓటే ఫలితాన్ని మార్చింది. ఆ కీలక ఓటుతో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేయగా, మున్సిపల్ పీఠాన్ని పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయం యాదృచ్ఛికంగా రాలేదని, ఎంపీ డా. కడియం కావ్య చేసిన సమన్వయం, వ్యూహాత్మక ప్రయత్నాలే గెలుపుకు బాట వేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎంపీ డా.కడియం కావ్య కృషి ఫలితంగానే తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేసిందని నేతలు స్పష్టం చేస్తున్నారు. తొర్రూరు మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడంతో ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు నిర్వహించారు. అనంతరం తొర్రూరు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన శ్రావణ్‌కుమార్, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సోమరజిని రాజశేఖర్‌లను ఎంపీ డా. కడియం కావ్య ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కావ్య రాజకీయ పట్టుదల, కృషి, సమన్వయ శక్తి– తొర్రూరు కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిందని పార్టీ వర్గాలు కొనియాడుతున్నాయి.














