మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులువరంగల్ టైమ్స్, ఢిల్లీ: భారత క్రికెటర్ మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోల్‌కత్తాలో షమీపై పెట్టిన గృహహింస, భరణం కేసులను ఢిల్లీకి మార్చాలని ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ పిటిషన్ దాఖలు చేసింది. తాము ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నామని, కోర్టు కేసుల కోసం ప్రతిసారి కోల్‌కత్తాకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని హసిన్ జహాన్ తెలిపింది. షమీ ఒక క్రికెటర్ అతను మ్యాచులు ఆడదానికి దేశం మొత్తం పర్యటిస్తుంటాడని, కేసు ఢిల్లీకి మార్చినా అతనికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించాలని మహమ్మద్ షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవలే తనకు, తన కూతురి నెలవారి జీవనాధారానికి ఇచ్చే భరణాన్ని రూ.4 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని హసిన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.