వైభవంగా దివ్య విమాన రథోత్సవం

వైభవంగా దివ్య విమాన రథోత్సవం

వైభవంగా దివ్య విమాన రథోత్సవంవరంగల్ టైమ్స్, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 26 గురువారం రాత్రి అత్యంత వైభవంగా దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన దివ్య విమాన రథంపై పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో అలంకరించి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకతో యాదగిరి ఆలయం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. బ్రహ్మోత్సవాలలో తిరుకల్యాణ మహోత్సవం తర్వాత, దివ్య విమాన రథోత్సవం ప్రధాన ఘట్టంగా భావిస్తారు. స్వామివారికి విశ్వక్సేనుడి పూజతో రథోత్సవాన్ని ఆరంభించి, దివ్య విమాన రథంపై ఊరేగింపు నిర్వహించారు. విమాన రథోత్సవం వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మెత్సవాల్లో భాగంగా యాదగిరి క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 27న చక్రతీర్థ స్నానం జరుగనుంది.