చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ గెలుపు
వరంగల్ టైమ్స్, నల్గొండ జిల్లా: తెలంగాణలో రెండు కార్పొరేషన్లు , 116 మున్సిపాలిటీలకు ఇటీవల పోలింగ్ జరిగింది. శుక్రవారం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు. ట్రాన్స్ జెండర్ శ్వేత సుధకార్ చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి బరిలో దిగారు. ఎన్నికల ప్రచారంలో శ్వేత సుధకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిట అభివృద్ధి లక్ష్యంగా సుధాకర్ ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను కాదని శ్వేత సుధకర్ ను గెలిపిందచుకున్నారు.














