తెలంగాణలో పెరగనున్న వాహనాల ధరలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణలో మార్చి 1వ తేదీ నుండి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేసే నిబంధనను ప్రభుత్వం అమలు చేయనుంది.ఈ పన్నుతో ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుండి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.













