పత్తికి రికార్డు స్థాయిలో పలికిన ధరలు

పత్తికి రికార్డు స్థాయిలో పలికిన ధరలువరంగల్ జిల్లా : రాష్ట్రంలో పత్తి రైతుల పంట పండుతున్నది. పత్తి ధర పరుగులు పెడుతుండటంతో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటంతో రైతుల ముఖాల్లో చిరు నవ్వులు పూస్తున్నాయి.

బుధవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.8,800 పలికింది. అటు ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ పత్తి రూ.9000 పలికిందని అధికారులు తెలిపారు. ఈ సీజన్ లో కాటన్ కి ఇదే రికార్డు ధర అని అధికారులు పేర్కొన్నారు.