ఎనుమాముల మార్కెట్ కు 3 రోజులు సెలవు

ఎనుమాముల మార్కెట్ కు 3 రోజులు సెలవువరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు మార్కెట్ కు సెలవులు ఉంటాయని ఎనుమాముల మార్కెట్ కమిటీ పేర్కొంది.

డిసెంబర్ 31 శుక్రవారము చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ పిలుపు, జనవరి 1 శనివారము వారంతపు యార్డు బంద్, జనవరి 2 ఆదివారము వారంతపు సెలవుగా ప్రకటించారు. తిరిగి జనవరి 3 సోమవారం రోజున మార్కెట్ పునఃప్రారంభము అవుతుందని తెలిపారు.