ఈ నెల 27న నటి తునీషా శర్మ అంత్యక్రియలు

ఈ నెల 27న నటి తునీషా శర్మ అంత్యక్రియలు

వరంగల్ టైమ్స్, ముంబై : శనివారం షూటింగ్ సెట్ లోనే ఆత్మహత్య చేసుకున్న యువ నటి తునీషా శర్మ అంత్యక్రియలు ఈ నెల 27న జరుగనున్నాయి. ఈ నెల 27న మీరా రోడ్ ఏరియాలోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తునీషా సమీప బంధువు పవన్ శర్మ తెలిపారు. తునీషా మేనత్త ఇంగ్లండ్ నుంచి వస్తున్నారని, ఆమె రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.ఈ నెల 27న నటి తునీషా శర్మ అంత్యక్రియలుతునీషా శర్మ ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఆమె పార్ధీవదేహాన్ని ముంబైలోని జేజే హాస్పిటల్ కు తరలించారు. తెల్లవారుజామున 4.30గంటలకు ఆమె బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 11 మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.