రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇచ్చేలా కృషి చేస్తా

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇచ్చేలా కృషి చేస్తా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. హనుమకొండ రెడ్డి కాలనీ లోని శారద గార్డెన్స్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం కార్యవర్గం మరియు హనుమకొండ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దాస్యం విజయ్ భాస్కర్ హాజరయ్యారు.రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇచ్చేలా కృషి చేస్తారేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితక్క దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా బత్తుల రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడారు. రేషన్ డీలర్లకు నెలకు గౌరవ వేతనం 30000 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబును రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన రేషన్ డీలర్లు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్, రెడ్డిమల్ల హనుమంతు, రాచమల్ల రాజు, తోట సమ్మయ్య, హనుమకొండ మండల అధ్యక్షుడు మహేశ్వరం గౌరీశంకర్, మహేష్ బాబు, తిరుమల ప్రభాకర్, 414 మంది రేషన్ డీలర్లు పాల్గొన్నారు.