ప్రముఖ నటి ప్రవీణ దేశ్ పాండే కన్నుమూత

ప్రముఖ నటి ప్రవీణ దేశ్ పాండే కన్నుమూత

ప్రముఖ నటి ప్రవీణ దేశ్ పాండే కన్నుమూతవరంగల్ టైమ్స్, ఫిల్మ్ డెస్క్: బాలీవుడ్ సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి ప్రవీణ దేశ్ పాండే మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్నేండ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ప్రవీణ ఆరోగ్యం ఇటీవల మరింత విషమించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ వార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పించారు.

రంగస్థల నటనతో తన కెరీర్ ను ప్రారంభించిన ప్రవీణ దేశ్ పాండే, నాటకాల్లో శిక్షణ పొందుతూ తన నటనా ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. అక్కడితో ఆపకుండా టెలివిజన్ సీరియల్స్, తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీతో పాటు మరాఠీ భాషల్లోనూ ఆమె అనేక పాత్రలు పోషఇంచి ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు. ముఖ్యంగా రెడీ సినిమాలో నటుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కీలక పాత్ర పోషించడం ద్వారా ఆమెకు విస్తృత గుర్తింపు లభించింది. అలాగే గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాల్లోనూ ఆమె నటన ప్రశంసలు అందుకుంది.